Tuesday, September 16, 2025
E-PAPER
Homeజాతీయంఐటీఆర్‌ దాఖలు గడువు నేటికి పెంపు

ఐటీఆర్‌ దాఖలు గడువు నేటికి పెంపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది. కేవలం ఒకే ఒక్కరోజు (సెప్టెంబర్‌ 16 వరకు) పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఆదాయపు పన్ను విభాగం ప్రకటన చేసింది. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో యూజర్ల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది.

2025-26 మదింపు సంవత్సరానికి గాను ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు జులై 31 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు డెడ్‌లైన్‌ విధించారు. సోమవారం ఆ గడువు పూర్తయింది. సెప్టెంబర్‌ 15 వరకు రికార్డు స్థాయిలో 7.3 కోట్లకు పైనే ఐటీఆర్‌ ఫైలింగ్‌లు జరిగినట్లు ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. గతేడాది జరిగిన ఐటీఆర్‌ ఫైలింగ్‌లు 7.27 కోట్లను ఈసారి అధిగమించినట్లు తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల వరకు ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ మెయింటనెన్స్‌ మోడ్‌లో ఉంటుందని, మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉందని ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -