Friday, December 19, 2025
E-PAPER
HomeNewsఅదంతా నకిలీ వీడియో: ఎంపీ సుధామూర్తి

అదంతా నకిలీ వీడియో: ఎంపీ సుధామూర్తి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తాను సూచించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నకిలీది అని రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అన్నారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల కోసం డీప్‌ఫేక్ వీడియోను దుర్వినియోగం చేస్తున్నారని.. అదంతా నకిలీ వీడియో అని కొట్టిపారేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ వీడియో సృష్టించారని వాపోయారు. దయచేసి ఆ వీడియోను నమ్మొద్దని కోరారు.

పెట్టుబడిదారులకు చెప్పేది ఒకటే.. తానెప్పుడూ ఎక్కడా పెట్టబడుల గురించి మాట్లాడలేదని.. ఆ విషయంలో తన ముఖాన్ని ఎప్పుడూ చూడరన్నారు. అలాంటి విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. పెట్టుబడుల కోసం తన ముఖాన్ని ఉపయోగించొద్దని.. మనస్ఫూర్తిగా కోరుతున్నారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -