నవతెలంగాణ-వీర్నపల్లి : వీర్నపల్లి మండలం కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ విద్యుత్ మాఫీ అయిన గృహ జ్యోతి బిల్లు పేపరును సెస్ డైరెక్టర్ మల్లేశం తో కలిసి లబ్ది దారులకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల పథకాల్లో ‘గృహ జ్యోతి’ ఒకటి. పేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ భారం తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ప్రతి గృహానికి ప్రభుత్వం ఉచితంగా కరెంటును అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కుల నరేష్,ఏ ఎం సి వైస్ చైర్మన్ లక్ష్మన్, వార్డు సభ్యులు భగ వంతం, సంజీవ్, గోరెమియ, పద్మయ్య, సురేష్, గ్రామ పెద్దలు రాజు, లక్ష్మి నారాయణ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ భారం తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



