Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం'సల సల మరిగే నీలోని రక్తమే…'

‘సల సల మరిగే నీలోని రక్తమే…’

- Advertisement -

‘మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో కీరవాణి ప్రాణం పోశారు’ అని హీరో పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈ పాట గురించి ఆయన మాట్లా డుతూ, ”హరిహర వీరమల్లు’ లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థి తులలో మనందరిలో వీరత్వం చేవజారి పోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను నేడు (బుధవారం) అందరికీ విన్పించబోతున్నారు. ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది. కీరవాణిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత, సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. కీరవాణి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు ‘నేను వయొలిన్‌ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం’ గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్‌ ఇచ్చిన వయొలిన్‌ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి. తెలుగు కథలను ప్రేమించే కీరవాణి తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు… చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే… కానీ కీరవాణి రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు. సజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్‌ వేదికపైకి తీసుకువెళ్లారు’ అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad