Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్పెద్దవూర నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన జే.శ్రీనివాస రావు

పెద్దవూర నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన జే.శ్రీనివాస రావు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర : పెద్దవూర మండల నూతన తహసీల్దార్‌గా జే.శ్రీనివాస రావు  శుక్రవారం బాధ్యతలను చేపట్టారు.గతంలో పీఏ పల్లిలో పనిచేసి పెద్దవూర కు బదిలీ పై వచ్చారు.ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ ముందరింటి శ్రీనివాసులు బదిలీ పై నాగర్ కర్నూలు కు బదిలీపై వెళ్లారు.ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కులం ఆదాయ ధ్రువ పత్రాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేసి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. అనంతరం వీఆర్‌ఓలు, వీఆర్‌ఏ రెవెన్యూ సిబ్బంది తో సమావేశమయ్యారు. సిబ్బంది అందరూ తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -