Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంజాకీ చాన్‌కు విశిష్ట పురస్కారం

జాకీ చాన్‌కు విశిష్ట పురస్కారం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రముఖ యాక్షన్ స్టార్ జాకీ చాన్‌కు విశిష్ట పురస్కారం లభించింది. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాకీ చాన్‌ జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. 78వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఆగస్టు 6న ప్రారంభమై 16వ తేదీ వరకు లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. ఈ సందర్భంగా జాకీ చాన్ ఆగస్టు 9న ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రస్తుతం జాకీ చాన్‌కు 71 సంవత్సరాలు. గతంలో మాదిరిగా స్టంట్స్ చేయకపోయినా ఇప్పటికీ తన మార్క్ ప్రదర్శిస్తూ మూవీల్లో పాత్రలు పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాగా, గత ఏడాది 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌ను ఇదే పురస్కారంతో సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img