- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మలిదశ విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ స్పీకర్ ప్రసాద్ సమక్షంలో పోచారం శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాదులు జగదీశ్ రెడ్డిని, అరెకపూడి గాంధీ తరఫు లాయర్లు కల్వకుంట్ల సంజయ్‌ను ప్రశ్నించనున్నారు. నిన్న స్పీకర్ సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఫిర్యాదు చేసిన జగదీశ్ రెడ్డిని, వెంకట్రావ్‌పై ఫిర్యాదు చేసిన వివేకానందను ఆధారాలకు సంబంధించి లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
- Advertisement -



