- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనూహ్యంగా ఏపీ మాజీ సీఎం జగన్ ఫొటోలు, వైసీపీ జెండాలు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య స్నేహబంధాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.
- Advertisement -



