Friday, September 19, 2025
E-PAPER
Homeసినిమా'జై..జై బగళాముఖీ..'

‘జై..జై బగళాముఖీ..’

- Advertisement -

నితిన్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘జై బగళాముఖీ..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, అజనీష్‌ లోకనాథ్‌ డివైన్‌ ట్యూన్‌తో కంపోజ్‌ చేశారు. సింగర్‌ అబీ వీ ఆకట్టుకునేలా పాడారు. ‘జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమ కారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని, వీర విహారిణి, క్షుద్ర విదారిణి, సర్వజీవ సంరక్షిణి జననీ…’ అంటూ సాగుతుందీ పాట. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మహిమను కీర్తిస్తూ గ్రామ జాతర వేడుక సందర్భంగా ఈ పాటను చిత్రీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -