Tuesday, July 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకడప కేంద్ర కారాగారంలో జైలు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

కడప కేంద్ర కారాగారంలో జైలు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని క‌డ‌ప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ కమలాకర్‌తోపాటు.. మరో ముగ్గురు జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.

కడప జైల్లో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై నాలుగు రోజులపాటు కడప జైల్లో డిఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురుపై సస్పెన్షన్ వేటు పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -