నవతెలంగాణ-హైదరాబాద్: మలేసియాలో ఈనెల 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు జరగనుంది. దీనికి ట్రంప్‌తో సహా ప్రపంచ నాయకులు హాజరుకాన్నారు. కాగా భారత్ ప్రధాని మోడీ ఈ సమావేశానికి గైరాజరు అవుతారని సమాచారం. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఆయన ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఆరోపించారు..
ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘చాలా రోజులుగా ఈ సదస్సు గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మోదీ దీనికోసం కౌలాలంపూర్ వెళ్తారా? లేదా? అని. మోదీ ఈ సదస్సుకు వెళ్లకపోవడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అక్కడ ఉండటమే. కొన్ని వారాల క్రితం ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సమావేశానికి కూడా మన ప్రధాని హాజరుకాలేదు.
కానీ, ట్రంప్ ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపానని 53 సార్లు.. రష్యా చమురును భారత్ కొనుగోలు నిలిపివేసిందని ఐదుసార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో కలవకుండా మోదీ జాగ్రత్త పడుతున్నారు’ అని విమర్శించారు.