నవతెలంగాణ-హైదరాబాద్: RSS అధినేత మోహన్ భగవత్ జన్మదినం సందర్భంగా పీఎం మోడీ ఆయన మెప్పు పొందిందేంకు విశ్వ ప్రయత్నాలు చెస్తున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. 1906 సెప్టెంబర్ 11న మహాత్మా గాంధీ ఇచ్చిన “మొదటి సత్యాగ్రహ పిలుపుతో పాటు “1893 సెప్టెంబర్ 11న స్వామి వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగం ప్రధానికి గుర్తుకు రాలేదని విమర్శించారు.. ఇలాంటి చారిత్రకమైన రోజుల గురించి ప్రస్తావించకుండా కేవలం..సంఘ అధినేత మోహన్ భగవత్ పుట్టినరోజు మాత్రమే గుర్తు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సంఘ అధినేతపై ప్రశంసల జల్లు కురిస్తున్నారని విమర్శించారు. సంఘ్ అధినేత పుట్టిన రోజు కూడా అనేక చారిత్రక సంఘటనలు జరిగినా..వాటి గురించి పీఎం మోడీ కనీసం ఒక మాట కూడా అనలేదని మండిపడ్డారు.



