Saturday, September 13, 2025
E-PAPER
Homeజాతీయంపాక్-యూఎస్ మైత్రిపై జైశంకర్ కీల‌క వ్యాఖ్య‌లు

పాక్-యూఎస్ మైత్రిపై జైశంకర్ కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీ వేదిక‌గా ‘వరల్డ్‌ లీడర్స్‌ ఫోరం’ సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ పాక్-యూఎస్ మైత్రిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా సైన్యం అబోటాబాద్‌లో ఒసామా బిన్‌ లాడెన్‌ను కోసం జరిపిన ఆపరేషన్‌ను గుర్తుచేశారు.

‘‘ఆ రెండు దేశాలకు పరస్పర చరిత్ర ఉంది. అంతేకాదు.. గతాన్ని విస్మరించిన చరిత్ర కూడా వారిదే. ఇటువంటివి మనం చూడటం కొత్తమీ కాదు. ఇదే అమెరికా సైన్యం అబోటాబాద్‌ (పాకిస్థాన్‌లోని) వెళ్లి ఎవర్ని గుర్తించిందో మనందరికీ తెలుసు’’ అని జైశంకర్‌ పేర్కొన్నారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై సెప్టెంబర్‌ 11నాటి దాడికి సూత్రధారి బిన్‌ లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -