- Advertisement -
- – ప్రభుత్వ నిర్ణయం సర్టిఫికెట్ల అందజేత
– ఎస్టీ జాబితాలోకి నక్కల కులస్తులు
నవతెలంగాణ-తొగుట
ప్రతి ఒక్కరు సర్టిఫికెట్లను సద్వినియోగం చేసు కొని.. సంక్షేమ ఫలాలు పొందాలని తహసిల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి మధిర గ్రామం చిన్న ముత్యంపేట గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడు తూ త్వరలోనే గ్రామంలోని అన్ని కుటుంబాలకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. నక్కల కులస్తుల ను ఎస్టి జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. దీంతో నక్కల కులస్తులలో ఆనందం వే ళ్లి విరిసింది.
- Advertisement -