నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులోని ఓ ఆలయ సంప్రదాయంలో భాగంగా జల్లికట్టు క్రీడా పోటీలను నిర్వహించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్ ఆలయం ఎదుట అట్టహాసంగా జల్లికట్టును ప్రారంభించారు. దీంతో ఆ ఆటను చూడడానికి స్థానికులతో పాటు చుట్టుపక్కల జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. జనాల రద్దీ దృష్ట్యా క్రీడ నిర్వహకులను పకబ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రీడలో బలిష్టమైన, పదునైనా కొమ్ములు కలిగిన 750 ఎద్దులు రంగంలోకి దింపారు. పందెం ఎడ్లను అదుపు చేసేందుకు కండలు తిరిగిన, బలమైన శరీర దారుఢ్యం కలిగిన 300మంది యువకులు పోటీలో పాల్గొనన్నారు. రంకెలేస్తూ పరిగెత్తే ఎద్దును మెడలు వంచి ఎవరైతే అదుపు చేస్తారో వారిని విజేతలు ప్రకటించనున్నారు. అయితే సాధారణంగా ఈ జల్లికట్టు క్రీడలు పొంగల్ పండగ సందర్భంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా మొదలౌవుతాయి.
