Saturday, January 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత

డీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆధునిక విజ్ఞాన శాస్త్ర గతిని మార్చేసిన డీఎన్ఏ ‘డబుల్ హెలిక్స్’ నిర్మాణ ఆవిష్కర్తల్లో ఒకరైన, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ జేమ్స్ డి. వాట్సన్ (97) కన్నుమూశారు. న్యూయార్క్‌లోని ఈస్ట్ నార్త్‌పోర్ట్‌లో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన్ను ఈ వారం ప్రారంభంలో హాస్పైస్ కేర్‌కు తరలించగా, అక్కడ ప్రశాంతంగా మరణించినట్లు ఆయన కుమారుడు డంకన్ వాట్సన్ ధ్రువీకరించారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -