Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంక‌ట్నం కోసం జ‌మ్మూలో దారుణం..

క‌ట్నం కోసం జ‌మ్మూలో దారుణం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో దారుణ గృహహింస సంఘటన చోటు చేసుకుంది. రూ.10 లక్షలు నగదు, కారు ఇవ్వాలన్న భర్త డిమాండ్‌ను భార్య తిరస్కరించడంతో, ఆమెపై ఘోరంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త భార్యపై దాడి చేసుతున్న సమయంలో ఇంటి చుట్టుపక్కన్న వాళ్లు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

దీనితో పోలీసులు తక్షణమే స్పందించి IPC 498A (కట్న వేధింపులు) భర్త లేదా బంధువుల ద్వారా హింసకు సంబంధించిన చట్టపరమైన విభాగాలతో పాటు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి నీచపు వారిని చంపేసిన పర్వాలేదంటూ పెద్దెతున్న ప్రజలు తమ ఆగ్రహాన్ని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img