Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 'జనంతో జానన్న' ప్రారంభం

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ‘జనంతో జానన్న’ ప్రారంభం

- Advertisement -

పది రోజులకోసారి నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజలతో నేరుగా మాట్లాడటం ద్వారా వారి సమస్యలను వినటంతో పాటు వివిధ అంశాలపై అభిప్రాయాలు, సూచనలను తెలుసుకునేందుకు వీలుగా సీపీఐ (ఎం) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నేరుగా పాల్గొనే ‘జనంతో జానన్న’ అనే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించింది. సీపీఐ (ఎం) తెలంగాణ యూ ట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ప్రతీ పది రోజులకు ఒకసారి నిర్వహించబోయే ప్రోగ్రాంను ఆయా రోజుల్లో రాత్రి ఏడు గంటలకు ప్రత్యక్ష ప్రసారం (లైవ్‌) చేయనున్నారు.
ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా శుక్రవారం రాత్రి జాన్‌వెస్లీ… లైవ్‌లో ప్రజలు, మేధావులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తెలంగాణాలోని పలు ప్రజా సమస్యలతో పాటు పాలస్తీనా, ఇరాన్‌లపై ఇజ్రాయిల్‌ యుద్ధం, ఆపరేషన్‌ కగార్‌, ఫహల్గాం ఘటన తదితరాంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజా ఉద్యమాలకు కార్పొరేట్‌ మీడియా స్థానం కల్పించడం లేదని వెస్లీ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల సోషల్‌ మీడియాను మరింత విస్తృతంగా వాడాలని ఆయన పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. తదుపరి కార్యక్రమం ఈ నెల 30న ఉంటుందని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో అత్యధిక సంఖ్యలో పాల్గొనటం, చర్చించటం, సమాధానాలను నివృత్తి చేసుకోవటం ద్వారా రాజకీయ పరిస్థితులు, ప్రజల దైనందిన సమస్యలపై మరింత అవగాహన పెంచుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad