- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపర్షిన అభ్యర్థి జంగిడి శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాడవాడకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు నిర్వహించారు. తన గెలుపుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలకు శ్రీనన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జంగిడి అత్యధిక మెజార్టీతో గెలుచుకున్న సందర్భంగా పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -


