- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : ఇటీవల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన పదిరోజుల తర్వాత జపాన్ దిగువ సభ బుధవారం సానే తకైచీని ప్రధానమంత్రిగా తిరిగి నియమించింది. సానే తకైచి అక్టోబర్‌లో జపాన్ మొదటి మహిళా ప్రధానిగా ఆమె బాధ్యలు చేపట్టారు. మూడు నెలల అనంతరం వచ్చిన ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఫిబ్రవరి 8న జపాన్ పార్లమెంట్ దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని సానే తకైచీ నేతృత్వంలోని పాలక సంప్రదాయవాద సంకీర్ణానికి మూడింట రెండువంతుల మెజారిటీ లభించింది. తమ భూభాగాలు మరియు జలాల భద్రతకు మద్దతుగా జపాన్ రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తామని, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తామని ఆమె ప్రతిజ్ఞ చేశారు.
- Advertisement -



