Friday, March 6, 2026
E-PAPER
Homeఆటలుజస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు..

జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా.. తాను వేసిన తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేయడం ద్వారా 500వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ వికెట్‌తో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, రవీంద్ర జడేజా, జవగల్ శ్రీనాథ్ సరసన బుమ్రా చేరాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత బౌలర్‌గా ఆయన చరిత్రకెక్కాడు. 2016 జనవరిలో ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి నిలకడగా రాణిస్తున్నాడు. 32 ఏళ్ల ఈ అహ్మదాబాద్ పేసర్ ఇప్పటివరకు 52 టెస్టుల్లో 234, 89 వన్డేల్లో 149, 94 టీ20ల్లో 117 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -