తోసిపుచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ : పాఠశాలల్లో ఉదయంపూట అసెంబ్లీ సమయాల్లో విద్యార్ధులు రాజ్యాంగ పీఠికను పఠించాలని ఆదేశించాలని కోరుతున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసి, జస్టిస్ సందీప్ మెహతాలతోకూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశించింది. విద్యా హక్కు గురించి మాట్లాడుతున్న రాజ్యాంగంలోని 21ఎఅధికరణను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. 6వ తరగతిలోని విద్యార్ధులకు ఇప్పటికే రాజ్యాంగ పీఠికను బోధిస్తున్నారని బెంచ్ వ్యాఖ్యానించింది. అందువల్లే ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్టు తెలిపింది.
రాజ్యాంగ పీఠిక పఠనంపై పిటిషన్
37 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)