Magazines

బ్లూ డ్రమ్‌' హత్య కేసులో సంచలన తీర్పు

1 గంట క్రితం

'Blue Drum' murder case
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

భార్య, ప్రియుడికి మరణశిక్ష
మీరట్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బ్లూ డ్రమ్‌' హత్య కేసులో మీరట్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి నీలిరంగు డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో పూడ్చిపెట్టిన భార్య ముస్కాన్‌ రస్తోగీ, ఆమె ప్రియుడు సాహిల్‌ శుక్లాలకు మేరఠ్ జిల్లా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ ఇద్దరు క్షమించరాని నేరం చేశారని జిల్లా న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ మిశ్రా తీర్పులో స్పష్టం చేశారు. ఈ హత్య కేసులో సెప్టెంబరు 30న కోర్టు నిందితులిద్దరినీ దోషులుగా తేల్చింది. బుధవారం తుది విచారణ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా జైలు నుంచి ముస్కాన్‌, సాహిల్‌లను వర్చువల్‌ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. వాదనలు పూర్తయిన అనంతరం న్యాయమూర్తి తీర్పును వెలువరిస్తూ నిందితులిద్దరికీ ఉరిశిక్ష ఖరారు చేశారు. అలాగే పలు సెక్షన్ల కింద రూ.20,000 జరిమానా కూడా విధించింది. సుమారు ఏడాదిన్నర పాటు జరిగిన సుదీర్ఘ విచారణలో ప్రాసిక్యూషన్ పలు కీలక వివరాలను సేకరించింది. మొత్తం 126 విచారణలు, సుమారు 22 మంది సాక్ష్యుల వాంగ్మూలాలను సేకరించింది. హత్య చేయడమే కాకుండా అందుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరూ చేసిన నేరం క్షమించరాదని పేర్కొంది. ఇలాంటి నేరాలు సమాజంలో తీవ్ర భయాన్ని సృష్టించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్