Magazines

మాజీ న్యాయమూర్తి సి.ఎస్‌ కర్నన్‌ కన్నుమూత

25 నిమిషాల క్రితం

C.S. Karnan passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

చెన్నయ్‌ : మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి సిఎస్‌ కర్నన్‌ (71)‌ శుక్రవారం చెన్నయ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరణించారు. 2017లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా వున్న సమయంలో కోర్టు ధిక్కార కార్యకలాపాలకు పాల్పడినందుకు సుప్రీంకోర్టు ఆయనకు ఆరు మాసాల జైలు శిక్ష విధించింది. పదవీ విరమణ కారణంగా 2020లో మరోసారి జైలు పాలయ్యారు. రిటైరైన తర్వాత యాంటీ కరప్షన్‌ ‌డైనమిక్‌ ‌పార్టీ పేరుతో రాజకీయ పార్టీని కూడా 2018లో స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేశారు. తాను షెడ్యూల్డ్‌ ‌కులానికి చెందినవాడనైనందున తన పట్ల సరిగా వ్యవహరించడం లేదంటూ ఇతర న్యాయమూర్తులపై కర్నన్‌ ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఆయన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా వున్నారు. ఎస్‌‌సి లాయర్లపై వివక్ష కనబరుస్తున్నారంటూ మాజీ చీఫ్‌ ‌జస్టిస్‌‌లు ఆర్‌.కె.అగర్వాల్‌, సంజయ్‌ ‌కిషన్‌ ‌కౌల్‌‌లతో బహిరంగ కోర్టులో కూడా ఆయన ఘర్షణలు పడిన సందర్బాలు వున్నాయి. మాజీ న్యాయమూర్తులను, వారి భాగస్వాములను, లాయర్లను, కోర్టు సిబ్బందిని, ఇతరులపై దూషణులు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ 33 వీడియోలను సోషల్‌ ‌మీడియాలో పెట్టారు. దాదాపు ఆయనపై 10 క్రిమినల్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇతర న్యాయమూర్తులపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు 2017 ఫిబ్రవరిలో అప్పటి చీఫ్‌ ‌జస్టిస్‌ ‌జె.ఎస్‌.కెహర్‌ ‌నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోర్డు ధిక్కార చర్యలు చేపట్టింది. ఆయన జ్యుడీషియల్‌, పాలనాపరమైన పనులు చేయనివ్వకుండా దూరం పెట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్