Magazines

తైవాన్‌ పునరేకీకరణ చారిత్రక లక్ష్యం

11 నిమిషాల క్రితం

The reunification of Taiwan is a historical goal.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

శాంతియుత పరిష్కారానికే చైనా ప్రాధాన్యం

ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేస్తాం

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్పష్టీకరణ

బీజింగ్‌ : చైనాను, తైవాన్‌ను తిరిగి ఒక్కటి చేయడం తమ దేశ చరిత్రలో అత్యంత కీలకమైన లక్ష్యమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. తైవాన్‌ సమస్యకు శాంతియుత పరిష్కారం సాధించడమే తమ విధానమని ప్రకటించారు. అదే సమయంలో చైనా విభజనకు దారితీసే వేర్పాటువాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించ బోమని తేల్చిచెప్పారు. తైవాన్‌ ప్రజల వాస్తవ పరిస్థితులు, వారి ప్రయోజనాలు, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుంటూనే పునరేకీకరణ దిశగా ముందుకు సాగుతామని వెల్లడించారు.

చైనా జాతీయ నాయకుల్లో ప్రముఖుడైన సన్‌ యాట్‌-సెన్‌ 160వ జయంతి సందర్భంగా గురువారం బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శి, కేంద్ర సైనిక కమిషన్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఆయన.. మాతృభూమి సంపూర్ణ పునరేకీకరణ అనేది కమ్యూనిస్టు పార్టీకి తిరుగులేని చారిత్రక బాధ్యతని వివరించారు.

చైనా ప్రజల ఉమ్మడి ఆకాంక్ష

చైనా పునరుజ్జీవనానికి సంపూర్ణ పునరేకీ కరణ సహజమైన అవసరమని జిన్‌పింగ్‌ అభి ప్రాయపడ్డారు. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా నివసించే ప్రజలు, దేశంలోనూ విదేశాల్లోనూ ఉన్న చైనీయులంతా ఈ లక్ష్యం కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేర్పాటువాద శక్తులను వ్యతిరేకిస్తూ, ఇరు ప్రాంతాల మధ్య శాంతియుత సంబంధాలను బలోపేతం చేయాలని కోరారు. తాజా ప్రసంగంలో జిన్‌పింగ్‌ శాంతియుత పునరేకీకరణ విధానానికే తమ ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు.

చర్చలకు సిద్ధమన్న బీజింగ్‌

తైవాన్‌లోని అన్ని రంగాల ప్రజలతో చర్చలు, సంప్రదింపులు జరిపేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్‌ తెలిపారు. అయితే ఇందుకు ‘ఒకే చైనా’ సూత్రం, 1992 ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని షరతు విధించారు.

ఈ ప్రాతిపదికన ఇరుపక్షాల మధ్య సంబంధాలు, జాతీయ పునరేకీకరణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. తైవాన్‌లోని ప్రజల వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటామని, వారి ప్రయోజనాలు, మనోభావాలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే తైవాన్‌ స్వాతంత్య్రం పేరుతో దేశ విభజనకు ప్రయత్నించే ఏ శక్తికీ అవకాశం కల్పించబోమని స్పష్టం చేశారు.

చారిత్రక పరిణామాన్ని ఆపలేరు

చైనా పునరేకీకరణ దిశగా సాగుతున్న చారిత్రక పరిణామాలను ఎవరూ అడ్డుకోలేరని జిన్‌పింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. మాతృభూమి సంపూర్ణ పునరేకీకరణ తప్పకుండా సాధ్యమ వుతుందనీ, అది నెరవేరి తీరుతుందని ప్రకటిం చారు. భవిష్యత్తులోనూ శాంతియుత పునరేకీ కరణ, ‘ఒకే దేశం – రెండు వ్యవస్థలు’ విధానా నికి చైనా కట్టుబడి ఉంటుందని తెలిపారు.

1992 ఏకాభిప్రాయం అనేది అప్పటి ఇరుపక్షాల నాయ కుల మధ్య కుదిరిన అనధికారిక అవగాహన. కాగా జిన్‌పింగ్‌ తాజా ప్రకటనతో దేశ సమగ్రత విషయంలో రాజీ పడబోమన్న సంకేతాన్నిచైనా ప్రపంచానికి పంపిందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్