Magazines

హైదరాబాద్ లో
కీలక అంశాలపై దృష్టి

10 నిమిషాల క్రితం

global issues
avatar
balaji

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్

నవతెలంగాణ-సిటీబ్యూరో హైదరాబాద్
సీపీగా మహేష్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం బంజా రాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో అధి కారికంగా గత సీపీ సజ్జనార్‌ ‌నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీపీ మాట్లా డుతూ.. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, మహిళా భద్రత, ట్రాఫిక్ వంటివి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా మన్నారు. సివిల్‌ ‌దగాదాల్లో పోలీసుల జోక్యం లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. మరోవైపు ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల భూ తగాదాల్లో దాడులు జరుగుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లో అనుభవం ఉన్న అధికారులు ఎందరో ఉన్నారని, అందరితో కలిసి టీమ్‌గా పని చేస్తామని వెల్లడించారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామన్నారు. పాత నేరస్థులపై నిఘా ఉంచుతామన్నారు. పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే శాఖాపరమైన చర్యలూ తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్