Magazines

సీజేపీ నేత అభిజీత్‌ దీప్కేకు బెయిల్‌...

1 గంట క్రితం

Bail for CJP leader
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నేహాబోరా కూడా విడుదల

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ​
కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేకు ఢిల్లీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ శనివారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో చేపట్టిన ‘లెహ్రా దో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి) నిరసన ప్రదర్శనకు వెళ్తుండగా పోలీసులు ఆయనను నిర్బంధించిన విషయం తెలిసిందే. అనంతరం ముందస్తు చర్యల్లో భాగంగా దీప్కేను అరెస్టు చేశారు. అనంతరం భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని 126వ సెక్షన్‌ కింద శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోనని హామీ ఇస్తూ బాండ్‌ సమర్పించాలని దీప్కేను మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదనే షరతుతో ఆయనను విడుదల చే శారు. ఈ కేసులో తదుపరి నిర్బంధం అవసరం లేదని పేర్కొంటూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే శుక్రవారం తిరంగా మార్చ్‌లో పాల్గొన్న ఎఐఎస్ఎ అధ్య‌క్షురాలు నేహాబోరాను మండిహౌస్ స‌మీపంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు శ‌నివారం ఉద‌యం ఆర్‌కె పురం పోలీస్‌స్టేష‌న్ నుంచి విడుదల చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్