Magazines

ప్రకృతి ఆరాధనే బతుకమ్మ

1 గంట క్రితం

Bathukamma is the worship
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు : సీఎం ఎ.రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక, ప్ర‌కృతి, ఆడబిడ్డ‌ల ఆరాధ‌న‌కు బ‌తుక‌మ్మ పండగ నిలువెత్తు నిద‌ర్శ‌నమ‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకృతి, పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని కొనియాడారు. తీరొక్క పూలతో చేసిన, ఘనమైన బతుకమ్మలతో ఆడ బిడ్డలందరూ ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాల పూలవాన కురిపించాలనీ, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించా రు. తెలంగాణ సంస్కృతి వైభవం తరతరాల పాటు నిలవాలని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆడ‌బిడ్డ‌ల‌కు ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నదని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్