Magazines

గో బ్యాక్‌ మోడీ

48 నిమిషాల క్రితం

Go back, Modi.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

తమిళనాడులో ప్రధానికి నిరసన సెగ

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాకు డిమాండ్‌

ప్లకార్డులు, నల్లజెండాలతో సీపీఐ(ఎం), ప్రతిపక్ష‍ పార్టీ, విద్యార్థి సంఘాల ప్రదర్శన

చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం

చెన్నై : ప్రధాని మోడీకి నిరసన సెగ తగిలింది. ఆదివారం తమిళనాడులో చెన్నై మెట్రో రెండో దశను ప్రారంభించేందుకు వెళ్లిన ప్రధానికి ఊహిం చని విధంగా..గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు హోరెత్తాయి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ను తొలగించా లని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం), ప్రతిపక్ష కూటమి నేతలు,పలు విద్యార్థి సంఘాల నాయకులు ప్రదర్శన నిర్వహించారు. నల్లజెండాలను ముఖాల కు కట్టుకుని, బ్యానర్ పట్టుకుని ఆందోళనలు చేపట్టారు. సభాస్థలి వైపు దూసుకువస్తుండ గా..పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నా రు. సీఈసీపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాగారూ. 13,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు..ప్రధాని మోడీ సుమారు చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశలోని పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం, ప్రధాని మోడీ పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనమల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో ప్రయాణించారు. మళ్లీ పోరూర్‌‌కు మెట్రోలో తిరిగి వచ్చారు. ఈ ప్రయాణంలో మోడీ వెంట తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 118.9 కిలోమీటర్ల పొడవైన రెండో దశను 2019లో ప్రారంభించారు. ఈ మార్గంలో సుమారు ఆరేండ్ల తరువాత ఆదివారం తొలిరైలు నడించింది.

ఈ కార్యక్రమం తరువాత చెన్నైలోని ఐఐటి మద్రాస్ క్యాంపస్‌‌కు మోడీ చేరుకున్నారు. పోరూర్ నుంచి ఐఐటి మద్రాస్ ప్రాంగణానికి రోడ్‌షోను మోడీ నిర్వహించారు. రోడ్డు, రైల్వే మౌలిక సదుపాయాలు, ఇంధన నిల్వ, ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులతో సహా మొత్తంగా రూ. 13,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్‌ ‌కూడా మోడీతో పాటు వేదికపై ఉన్నారు. మోడీ మాట్లాడుతూ తమిళనాడును అభివృద్ధి చేయాలని, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ “రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం’ అని చెప్పారు.ఈ కార్యక్రమం తరువాత నందంబక్కంలోని చెన్నై ట్రేడ్ సెంటర్‌లో జరిగిన జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లోనూ మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దేశంలో త్వరలో భారీ క్రీడా కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, 2036 ఒలింపిక్స్ నిర్వహించాలన్న కలను కూడా సాకారం చేసుకునే దిశగా సాగుతున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్