కేంద్ర క్యాబినెట్ ఆమోదం
రవాణా, లాజిస్టిక్స్ కోసం
సమగ్ర ప్రాధికార సంస్థ ఏర్పాటు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చిన్న, మధ్యతరహా పరిశ్రమ లకు (ఎస్‌ఎంఈ) దీర్ఘకాలిక మూల ధనం అందించేందుకు రూ.10 వేల కోట్లతో ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మంగళ వారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే దేశంలో రవాణా, లాజిస్టిక్స్ రంగాల ప్రణాళిక, పర్యవేక్షణ, ప్రాజెక్టుల పరిశీలన కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ఐటీఎల్ఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.500 కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే కేంద్ర ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఐటీఎల్ఏ సాంకేతిక మదింపు నిర్వహించనుంది. ప్రధాని మోడీ 25 ఏండ్ల రాజకీయాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనను అభినం దిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రివర్గ తీర్మానంలోని పది కీలక అంశాలు ఉన్నాయి.






కామెంట్‌లు (0)