ముంబయి: ఏడాది వ్యవధిలో మారుతీ సుజుకీ నాలుగో సారి ధరలను పెంచింది. ఈ మేరకు ఎక్స్ఛేంజి ఫైలింగ్‌ల ో పేర్కొంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ధర 0.31శాతం పెంచినట్టు వెల్లడించింది. ‘‘ముడి సరుకు ధరల ఒత్తిడి కారణంగా కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ధరలు పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ఇది 22 నవంబర్ 2026 నుంచి అమల్లోకి రానుంది. సగటు ధరల పెరుగుదల 0.31 శాతం వరకు ఉండొచ్చు’’ అని మారుతీ పేర్కొంది. తమ కార్ల ధరలను తగ్గించే యత్నం చేసినా.. వ్యయాల ఒత్తిడి కారణంగా కొంత భారం వినియోగదా రులకు బదిలీ చేయాల్సి వస్తోందని వెల్లడించింది. ఈ క్రమంలో వీలైనంత తక్కువగా ఈ భారం ఉండేట్లు చూశామని వెల్లడించింది. మారుతీ సుజుకీ 2026లో పలు మార్లు వాహనాల ధరలను పెంచింది. సెప్టెంబర్‌లో కొన్నింటిపై రూ.20 వేల వరకు పెంపు ప్రకటించింది. దాని కంటే ముందు ఎరినా, నెక్సాలోని కొన్ని మోడళ్లపై ఆగస్టులో రూ.30 వేలు పెంచింది. జూన్‌లో కూడా ఒక సారి రూ.30 వేలు పెంచింది. మారుతీ సుజుకీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభాల్లో 26.9శాతం తగ్గుదల కనిపించింది. రెవెన్యూ మాత్రం 26శాతం పెరిగి రూ.53,340 కోట్లకు చేరింది.






కామెంట్లు (0)