Magazines

సర్‌ రద్దు చేయాలి..ఎన్నికల కమిషన్‌ను సంస్కరించాలి

3 గంటల క్రితం

Election
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 2 నిమిషాల చదవడం

దేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు

నవతెలంగాణ..న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్జానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం 'నా నగరం.. జంతర్‌ మంతర్‌' నినాదంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఆందోళనల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌ ) ప్రక్రియను రద్దు చేయాలని, ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నేత‌లు డిమాండ్‌ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని పరివర్తన్‌ చౌక్‌ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్థులు పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోనూ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. చెన్నైలో అంబేద్కర్‌ స్మారక స్థలం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించి ఎస్‌ఐఆర్‌ ఉపసంహరణకు డిమాండ్‌ చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. కర్నా టకలోని కాల్బుర్గి లో పాఠశాల విద్యార్థులు సహా పలువురు నిరసనలో పాల్గొన్నారు. రాజస్తా న్‌లోని ఝుంఝునులో మొరారిక కళాశాల ఎదుట, హర్యానాలోని రోహ్‌తక్‌ మహర్షి దయానంద్‌ విశ్వవిద్యాలయంలోనూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో 'పీపుల్‌ ఎగ్నెస్ట సర్' కూటమితో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ నిరసన చేపట్టింది.సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వివిధ ప్రజాసంఘాలు, రైతు సంఘాలు పెద్దఎత్తున నిరసనకు దిగాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మందిర్‌ మార్గ్‌లో నిర్వహించిన ఆందోళనలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

మందిర్‌ మార్గ్‌లోని వాల్మీకి సదన్‌ ఎదుట నిరసన జరిగింది. ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, ఎఐఎస్‌ఎఫ్‌, కెవైఎస్‌, ఎఐఎస్ఎ తదితర సంఘాలు ఆందోళనలో భాగస్వాములయ్యాయి. మందిర్‌ మార్గ్‌ నుంచి జంతర్‌మంతర్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నాయి. దీంతో నిరసనకారులు వాల్మీకి సదన్‌ ఎదుటే ఆందోళన కొనసాగించారు. ఈ నిరసనకు ఐద్వా అధ్య‌క్ష‌, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శులు పి.కె.శ్రీమతి, కనినిక ఘోష్‌, జాతీయ నేత ఎస్‌.పుణ్య‌వ‌తి, ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ కార్యదర్శి సూరజ్‌ ఇళమన్‌, ఎఐఎస్ఎ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు నాయకురాలు అన్నీరాజా, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్‌, అంజలి భరద్వాజ్‌ తదితరులు నాయకత్వం వహించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్