తగ్గనున్న చెరకు దిగుబడులు
న్యూఢిల్లీ : రాబోయే కాలంలో చక్కెర చేదెక్కబోతోంది. చెరకు ఉత్పత్తి పడిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2026-27 సీజన్ (అక్టోబర్`సెప్టెంబర్)లో స్థూల చక్కెర ఉత్పత్తి పదిహేను శాతం తగ్గుతుందని అంచనా. చెరకు పంటను అధికంగా పండించే మహారాష్ట్ర, కర్నాటకలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులే దీనికి కారణం. అయితే ప్రస్తుత సీజన్‌లో ఇథనాల్ ఉత్పత్తికి చెరకును ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిలిపివేయడంతో పంట లభ్యతలో పెద్దగా లోటు కన్పించడం లేదు. గత సీజన్‌లో చక్కెర నికర ఉత్పత్తి సుమారు 280 లక్షల టన్నులు ఉండగా ప్రస్తుత సీజన్‌లో 265 లక్షల టన్నుల వరకూ ఉంటుందని చెబుతున్నారు. గడచిన దశాబ్ద కాలంలో చక్కెర నికర ఉత్పత్తి 2016- 17లో అతి తక్కువగా 202.5 లక్షల టన్నులుగా నమోదైంది.
2024-25లో 216 లక్షల టన్నుల నికర ఉత్పత్తి జరిగింది. ఇథనాల్ తయారీకి చెరకును వినియోగించడమే స్థూల, నికర ఉత్పత్తులలో వ్యత్యాసానికి కారణం. ఈ సీజన్‌లో అలా ఇథనాల్ తయారీకి చెరకును మళ్లించే అవకాశం లేనందున జరిగే చక్కెర ఉత్పత్తి మొత్తం దేశీయ వినియోగానికే ఉపయోగపడుతుంది. మన దేశంలో ఏటా 280-285 లక్షల టన్నుల చక్కెరను వినియోగిస్తారు. ఈ సీజన్‌లో జరిగే ఉత్పత్తి దేశీయ డిమాండ్‌ను తీర్చలేదు. ఫలితంగా చిల్లర ధరలపై ఒత్తిడి పడుతుంది. దిగుమతులు కూడా పెరగవచ్చు. చెరకును పండించే ప్రధాన నగరాల్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఇండియన్ సుగర్ అండ్ బయో- ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ (ఐఎస్‌ఎంఏ) తెలిపింది. ఎల్‌నినో సంబంధమైన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితుల్లో అప్పుడప్పుడు కురిసే వానలు వంటి అంశాలు పంట దిగుబడులపై ప్రభావం చూపుతాయని వివరించింది.
చేదెక్కనున్న చక్కెర
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)