Sunday, May 11, 2025
Homeజాతీయంనేడు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు

నేడు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్ పాక్ మధ్య హోరా హోరీ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందాడు. ఏపీ లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్… జమ్ము కశ్మీరులోని ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో అసువులు బాసాడు. శనివారం రాత్రి మురళి పార్థివ దేహాన్ని స్వగ్రామం కల్లితండాకు తీసుకు వచ్చారు. నేడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. మురళి నాయక్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -