నవతెలంగాణ – హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్‌ను సహించలేని దాయాది పాకిస్థాన్ వక్రబుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై మిస్సైల్, డ్రోన్ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. ఈ వీర జవాన్‌ది ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని కల్లి తండా. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరపగా మన సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయారు. మురళీ నాయక్ మరణ వార్త తెలుసుకున్న తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అల్లారుముద్దుగా పెంచిన ఒక్కగానొక కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లి ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. మళ్లీ తన కుమారుడిని చూడలేనంటూ ఇంటికి వస్తున్న బంధువులను పట్టుకుని విలపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జవాన్ ఇతర కుటుంబ సభ్యులు కూడా కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీంతో మురళీ నాయక్ స్వగ్రామం కల్లితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మురళీ నాయక్ పార్థివ దేహం రేపు స్వగ్రామానికి చేరుకోనుందని సమాచారం.
జవాన్ మురళీ మృతి.. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES