Friday, May 23, 2025
Homeజాతీయంజవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌షా భారత్‌కు అప్ప‌గింత‌

జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌షా భారత్‌కు అప్ప‌గింత‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షా ను భారత్‌ కు పాక్‌ అప్పగించింది. 2025 ఏప్రిల్‌ 23వ తేదీన వాఘా సరిహద్దు ప్రాంతంలో బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణం కుమార్‌ షా అనుకోకుండా సరిహద్దు దాటడంతో పాక్‌ రేంజర్లు అతడిని పట్టుకున్నారు. జవాన్‌ విడుదలపై పాక్‌తో భారత్‌ సంప్రదింపులు జరిపింది. ఈక్రమంలో నేడు జవాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు అమృత్సర్‌లోని జాయింట్‌ చెక్‌ పోస్ట్‌ అట్టారి ద్వారా భారతదేశానికి అప్పగించారు. అప్పగింత శాంతియుతంగా, స్థిరపడిన ప్రోటోకాల్‌ల ప్రకారం జరిగింది” అని బిఎస్‌ఎఫ్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -