- Advertisement -
– జీవో జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రోడ్లు, భవనాల శాఖ నూతన ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా టి.జయభారతి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం సోమవారం జీవో నెంబరు 289 జారీ చేసింది. ఇన్‌చార్జి చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న జయభారతికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్ ఇచ్చిన ఆదేశాల్లో ప్రస్తుతం బాధ్యతల్లో ఈఎన్సీ ఎస్.తిరుమల సోమ వారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో కొత్త నియామకం అవసరమైనట్టు అధికారులు చెప్పారు. కొత్త ఈఎన్సీ జయభారతి మంగళవారం చార్జీ తీసుకుంటారు.
- Advertisement -