Thursday, September 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజయశంకర్‌కు అసెంబ్లీ స్పీకర్‌,

జయశంకర్‌కు అసెంబ్లీ స్పీకర్‌,

- Advertisement -

మండలి చైర్మెన్‌ నివాళులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ, మండలిలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, శాసన మండలి ఆవరణలో చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జయశంకర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. తెలంగాణ ఆవశ్యకతను యువతకు అర్ధం అయ్యేలా రచనలు చేసి ఉద్యమానికి ఊపిరిగా నిలిచారని కొనియాడారు. జయశంకర్‌ జీవితం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -