– రాష్ట్రవ్యాప్తంగా 19 వరకు నిర్వహణ
– బడులు తెరిచిన మొదటిరోజే పుస్తకాలు, యూనిఫారాల అందజేత : విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరంలో జయ శంకర్ బడిబాట కార్యక్రమాన్ని వచ్చేనెల ఆరో తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి శనివారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వచ్చేనెల 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని తెలిపారు. మొదటిరోజు గ్రామసభ నిర్వహించాలని సూచించారు. ఏడున ప్రతి ఇంటినీ సందర్శించి బడిఈడు పిల్లలను గుర్తించాలని కోరారు. ఎనిమిది నుంచి పదో తేదీ వరకు కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేపట్టాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలనీ, డ్రాపౌట్ పిల్లలను గుర్తిం చాలని పేర్కొన్నారు. వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంతోపాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించా లని వివరించారు. 11న బడిబాట ప్రారంభం నుంచి నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలని తెలిపారు. వచ్చేనెల 12న పాఠశాలల పున:ప్రారంభం రోజే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలని సూచిం చారు. అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్త కాలు, యూనిఫారాలను అందించాలని అధికారులను ఆద ేశించారు. 13న సామూహిక అక్షరాభ్యాసం బాలల సభను నిర్వహించాలని కోరారు. 16న ఎఫ్‌ఎల్‌ఎన్, లిప్ దినోత్స వం నిర్వహించాలని తెలిపారు. 17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. 18న తరగతి గదుల డిజటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకంపై ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలని సూచించారు. వచ్చేనెల 19న జయశంకర్ బడిబాట ముగింపు సందర్భ ంగా విద్యార్థులకు క్రీడాపోటీలను నిర్వహించాలని కోరారు. బడిబాటను విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల డీఈవోలు, ఈవో-డీపీవోలు, సమగ్ర శిక్ష అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని నరసింహారెడ్డి తెలిపారు. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అధికారుల ను ఆదేశించారు. అన్ని ఆవాసాల్లో బడిఈడు పిల్లలను గుర్తించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును పెంచాలనీ, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ), అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు (ఏఏపీసీ) సహాయం తీసుకుని ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో బడిఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ (వీఈఆర్)ను అప్‌డేట్ చేయాలనీ, పర్మినెంట్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ (పీఈఎన్)ను అప్‌డెట్ చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఆరో తరగతి, ఎనిమిదో తరగతిలో చేర్పిం చాలని వివరించారు. తక్కువ పిల్లలున్న పాఠశాలలను గుర్తించి వాటిలో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలనీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సహాయంతో వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలని పేర్కొన్నారు. బాలికల నమోదును పెంచాలని కోరారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, పౌరసమాజంలో విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) గురించి అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలకు హాజర య్యేలా చూడాలని తెలిపారు. జయశంకర్ బడిబాట కార్య క్రమంలో కలెక్టర్లు, డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు.
6 నుంచి జయశంకర్ బడిబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES