నవతెలంగాణ-హైదరాబాద్: కొన్ని రోజులుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విపత్కర పరిస్థితులు సంభవిస్తే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు.. ఆయనతో కలిసి పని చేసే వారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవాళ్లే ఉన్నారు.. కానీ, వారందరి కంటే చివరిగా నిద్ర పోయేది, ఉదయాన్నే మొదట నిద్ర లేచేది అధ్యక్షుడేనని పేర్కొన్నాడు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయి.. వాటన్నింటినీ దాటుకొని.. ట్రంప్ మిగిలిన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అమెరికన్లకు ట్రంప్ మంచి చేస్తారన్న నమ్మకం ఉంది.. ఒకవేళ ఏదైనా అనుకొని సంఘటన జరిగితే.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.