నవతెలంగాణ-హైదరాబాద్: జేఈఈ మెయిన్ 2026 (సెషన్-1) ప్రొవిజినల్ ఆన్సర్ కీ బుధవారం విడుదలయ్యింది. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించారు. పేపర్ -1కు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను ఎన్‌టీఏ అధికారులు ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ కీపై నేటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 11.50గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొవిజినల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలపడానికి అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున (నాన్ రిఫండ్) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన అనంతరం తుది కీ విడుదల చేసి ఫిబ్రవరి 12 నాటికి ఫలితాలు ప్రకటించనున్నారు. జేఈఈ మెయిన్ పేపర్ -1 పరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన సంగతి విదితమే.
జేఈఈ మెయిన్-2026 ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



