నవతెలంగాణ-హైదరాబాద్: జేఈఈ మెయిన్ సెషన్-2కు దరఖాస్తులను సమర్పించేందుకు మరో అవకాశం కల్పించినట్లు ఎన్‌టిఎ అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుండి మార్చి 13న రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు. మార్చి 13వ తేదీ రాత్రి 11.50గంటల వరకు దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చని అన్నారు. జెఇఇ మెయిన్ సెషన్-2 గడువు ఫిబ్రవరి 25తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించాలంటూ పలువురు విద్యార్థుల నుండి వచ్చిన అభ్యర్థనల దృష్ట్యా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌టిఎ అధికారులు తెలిపారు. ఈ అవకాశం దరఖాస్తులు సమర్పించని, ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులకు మాత్రమేనని ఎన్‌టిఎ స్పష్టం చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దరఖాస్తుల్లో మార్పులు చేసేందుకు కూడా అనుమతి లేదని పేర్కొంది.
జేఈఈ మెయిన్ సెషన్-2..దరఖాస్తుకు మరో అవకాశం
- Advertisement -
- Advertisement -



