Saturday, September 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరూ.17 కోట్ల నగలు చోరీ..

రూ.17 కోట్ల నగలు చోరీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని సియాటెల్‌ నగరంలో స్థానిక నగల దుకాణంలోకి భారీ దోపిడీ దుండగులు చేశారు. 2 నిమిషాల్లోపే దాదాపు రూ.17.53కోట్లు నగలను దోచుకెళ్లారు. పూర్తి వివరల్లోకి వెలితే.. వెస్ట్‌ సియాటెల్‌లోని మినాషే అండ్‌ సన్స్‌ నగల దుకాణంలో అందరూ చూస్తుండగానే ఈ దోపిడీ జరిగింది. మాస్క్‌లు ధరించిన నలుగురు దుండగులు గ్లాస్‌ డోర్‌ను బద్దలుకొట్టి లోపలికి వచ్చారు.

అక్కడున్న సిబ్బందిని బెదిరించి డిస్‌ప్లేలో ఉంచిన ఆభరణాలు, లగ్జరీ వాచ్‌లను ఎత్తుకెళ్లారు. మొత్తం ఆరు డిప్‌ప్లే కేస్‌లలోని వజ్రాభరణాలు, గడియారాలను దొంగలు దోచేశారు. కేవలం 90 సెకన్లలోనే వాటిని తీసుకుని పరారయ్యారు. ఈ దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఇవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -