నవతెలంగాణ- కంఠేశ్వర్
ఈనెల తేది 5, 6 జూలై విశాఖపట్నం లో కాకతీయ కన్వెన్షన్ హాల్ లో సౌత్ కార్నివాల్ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు 14 రాష్ట్రాలకు చెందిన 18 క్లబ్బులు పాల్గొన్నాయి. ఇందూరు కు చెందిన విజయానంద్ జె సి ఐ అలుమ్ని క్లబ్ ఇండియా జోన్ 12(తెలంగాణ మరియు కర్ణాట ) లో వైస్ చైర్మన్ (పబ్లిక్ రిలేషన్ ప్రోగ్రామ్, శిక్షణ విభాగం కోచింగ్ మరియు మెంటరింగ్ ) గా వ్యవహరిస్తున్నారు. విజయానంద్ కు ఉత్తమ జోన్ వైస్ చైర్మన్ గా మరియు అతను వ్యవహరిస్తున్న ఉత్తమ శిక్షణ విభాగo కోచింగ్-మెంటారింగ్, పబ్లిక్ రిలేషన్ కార్యక్రమం లకు కూడా అవార్డులు లభించాయి.అవార్డుల ను ఇండియా నేషనల్ చైర్మన్ అంజలి బాత్ర గుప్తా, నేషనల్ వైస్ చైర్మన్ జై కుమార్, అందచేశారు. ఈ కార్యక్రమం లో నేషనల్ వైస్ చైర్మన్ మనోజ్ టక్కర్, నేషనల్ కోఆర్డినేటర్ జి. వి. ఎన్.రాజు, జోన్ వైస్ చైర్మన్ లు నవీన్ చావల్ల, మహేష్ గోలేచ్చ, శ్రీనివాస్ వీరబోమ్మ,మరియు జోన్ అధికారులు వినయ్, చైతన్య, సంతోష్ లు పాల్గొన్నారు.
సౌత్ కార్నివాల్ లో జీలకార్ విజయానంద్ కు ఉత్తమ వైస్ చైర్మన్ అవార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES