నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ 11ఏండ్ల పాలనపై జార్ఖండ్ ముక్తి మోర్చ(JMM) సెటైర్లు వేసింది. పీఎం మోడీ ప్రభుత్వ పాలనలో 111 ఫెయిలర్స్ ఉన్నాయని, దీంతో అభివృద్ధిలో భారత్ వెనుకబడిపోయిందని జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రీయా భట్టాచార్య విమర్శించారు. విదేశీ పర్యటనల పేరుతో వేలకోట్లు దుర్వినియోగం చేశారని మంగళవారం మీడియా సమావేశంలో ఆయన ఆరోపించారు. పహల్గాం దాడి తర్వాత..దౌత్యపరంగా మోడీ విఫలమైయ్యారని విమర్శించారు. పహల్గామ్ సంఘటనను అమలు చేసిన నలుగురు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారని?”, కెనడాలో జరగబోయే G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించబడటానికి దేశం ఇప్పుడు “దరఖాస్తు” ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు, నిరుద్యోగిత, రాజ్యాంగ వ్యవస్థలను బలహీనమైపోయ్యయన్నారు. 2014 ముందు జీడీపీ వృద్ధిలో MSMEs వాటా 16శాతం ఉంటేందని,కానీ మోడీ పాలనలో 7శాతానికి పడిపోయిందని సుప్రీయా భట్టాచార్య గుర్తు చేశారు. రెండ్ కోట్ల ఉద్యోగాలు యువతకు ఇస్తానని బీజేపీ దేశంలోని యువతను నమ్మించి మోసం చేసిందని,కానీ అదికారంలోకి వచ్చాకా మొండిచేయి చూపిందని ఆరోపించారు. బీజేపీ పాలనలో మహిళాలు సాధికారత సాధించారని క్యాబినేట్ మంత్రులు చెప్తున్న మాటలకు సత్యదూరమన్నారు.