Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంజేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ అదృశ్యం కేసు మూసివేతకు అనుమతి

జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ అదృశ్యం కేసు మూసివేతకు అనుమతి

- Advertisement -

న్యూఢిల్లీ: ఏబీవీపీ గుండాలతో ఘర్షణ జరిగిన తరువాత రోజు నుంచి కనిపించకుండా పోయిన జేఎన్‌యూ విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ అదృశ్యం కేసును మూసివేశారు. ఈ కేసును విచారణ చేస్తున్న సీబీఐకి మూసివేయడానికి ఢిల్లీ కోర్టు సోమవారం అనుమతించింది. సీబీఐ సమర్పించిన మూసివేత నివేదికను అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ జ్యోతి మహేశ్వరి సోమవారం ఆమోదించారు. అలాగే ఈ కేసులో ఏదైనా ఆధారాలు దొరికితే కేసును తిరిగి ప్రారంభించడానికి సీబీఐకి జడ్జి స్వేచ్ఛ ఇచ్చారు. జేఎన్‌యూ మొదటి సంవత్సరం విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ 2016 అక్టోబర్‌ 15న అదృశ్యమయ్యారు. జేఎన్‌యూ మహి-మాండ్వి హాస్టల్‌ నుంచి అహ్మద్‌ కనిపించకుండా పోయారు. అంతకు ముందు రోజు రాత్రి ఏబీవీపీ గుండాలు అహ్మద్‌తో ఘర్షణ పడ్డారు. ఈ కేసును ముందుగా ఢిల్లీ పోలీసులు విచారణ చేశారు. తరువాత సీబీఐకి బదిలీ చేశారు. నిజానికి నజీబ్‌ అహ్మద్‌ అచూకీ కనుగొనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూ 2018 అక్టోబర్‌లోనే సీబీఐ తన దర్యాప్తును ముగించింది. ఢిల్లీ హైకోర్టు అనుమతితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసు ముగింపు నివేదికను కోర్టుకు సమర్పించింది.
కాగా, నజీబ్‌ అహ్మద్‌ తరపు న్యాయవాది గతంలోనే మాట్లాడుతూ.. ఇది ఒక రాజకీయ కేసు, సీబీఐ తన యజమానుల (కేంద్ర ప్రభుత్వం) ఒత్తిడికి లొంగిపోయిందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -