నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. లాలాపేటలోని GHMC ఇండోర్ స్టేడియంలో ఉంచిన అందెశ్రీ భౌతిక దేహాన్ని సీపీఐ(ఎం) రాష్ట్రకార్యదర్శి జాన్ వెస్లీ సందర్శించారు. అందెశ్రీ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాలర్పించారు. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రేపు ఘట్కేసర్ సమీపంలోని NFC నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అందెశ్రీ భౌతికకాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పిస్తారు. లాలాపేటలోని GHMC ఇండోర్ స్టేడియంలో ఉంచిన అందెశ్రీ భౌతికకాయం సందర్శించడానికి కుటుంబసభ్యులు, రాజకీయనేతలు, కళాకారులు, రచయితలు తరలివస్తున్నారు.



