Monday, December 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచిలీ అధ్యక్ష ఎన్నికల్లో జోస్ ఆంటోనియో కాస్ట్‌ విజయం

చిలీ అధ్యక్ష ఎన్నికల్లో జోస్ ఆంటోనియో కాస్ట్‌ విజయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆదివారం జరిగిన చిలీ అధ్యక్ష ఎన్నికల్లో మితవాద అల్ట్రా-కన్జర్వేటివ్ అభ్యర్ధి జోస్ ఆంటోనియో కాస్ట్‌ విజయం సాధించారు. పెరుగుతున్న నేరాలు, వలసలపై ఓటర్ల భయాలను ఉపయోగించుకోవడంలో అల్ట్రా-కన్జర్వేటివ్ సఫలమైంది. దీంతో 1990 సైనిక నియంతృత్వం తరువాత చిలీలో అత్యంత తీవ్రమైన మితవాద పార్టీ గెలుపొందిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాస్ట్‌ ప్రత్యర్థి అయిన వామపక్ష సంకీర్ణ అభ్యర్థి కమ్యూనిస్ట్ జీనెట్ జారా ఓటమి పాలైయ్యారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం, కాస్ట్ 58% ఓట్లు పొందగా, వామపక్ష ప్రభుత్వంలో మాజీ కార్మిక మంత్రి అయిన జారా 41% ఓట్లను పొందారు. సరిహద్దు గోడలను నిర్మించడం, అధిక నేర ప్రాంతాలకు సైన్యాన్ని మోహరించడం, దేశంలో అక్రమంగా ఉన్న వలసదారులందరినీ బహిష్కరించాలని కాస్ట్ ప్రతిపాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -