Friday, October 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలు‘జూబ్లీ’ బైపొల్..ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌

‘జూబ్లీ’ బైపొల్..ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు నామినేషన్‌ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. అనంతరం జరిగిన స్క్రూటినీ ప్రక్రియలో 186 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లని వాటిగా తేలాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే, శుక్రవారం 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. త్వరలోనే బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో గుర్తుల కేటాయింపు జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -