- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటి వరకు 127 నామినేషన్లు దాఖలు కాగా మంగళవారం బాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈనెల 22న నామినేషన్లను పరిశీలిన, నవంబర్ 11న పోలింగ్ , 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అక్టోబర్ 24 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు .
- Advertisement -